calender_icon.png 26 October, 2024 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా విద్య నాసికరం

26-10-2024 12:38:32 AM

భారత దౌత్యవేత్త సంజీవ్‌వర్మ

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: పై చదువుల కోసం కెనడా వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భారత దౌత్యవేత్త సంజీవ్‌కుమార్ వర్మ హెచ్చరించారు. 2022 నుంచి ఇటీవల వరకు కెనడా హైకమిషనర్‌గా పనిచేసిన సంజీవ్.. ఆ దేశంలోని పరిస్థితులను పీటీ ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ దేశంలో నాసిరకం విద్యాసంస్థల కారణంగా లక్షలు ఖర్చుపెట్టినా ఉద్యోగాలు రావడం లేదని వాపోయారు. ‘కెనడాలో నేను పనిచేసినప్పుడు వారానికి కనీసం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బాడీ బ్యాగ్‌ల్లో భారత్‌కు పంపించాం. అవి ఆత్మహత్యలు చేసుకొన్నవారివి. భవిష్యత్తుపై ఎన్నో కలలతో కెనడాకు వెళ్లి శవాలుగా తిరిగి వస్తున్నారు. పిల్లలు అక్కడ దారుణమైన డార్మెటరీల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కోగదిలో 8మంది వరకు నిద్రపోతున్నారు’ అని పేర్కొన్నారు.