calender_icon.png 22 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ విద్యార్థులపై కెనడా ఆంక్షలు

20-09-2024 01:59:36 AM

ఓట్టావా, సెప్టెంబర్ 19: విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇస్తూ కెనడాలోని ట్రుడో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు 2025 నుంచి స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలోకి వలసలను నియంత్రించడానికి ఫారెన్ స్టూడెం ట్స్‌కు స్టడీ, వర్కర్ల పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్ చేసింది. 2025లో విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 10 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది.

అలాగే ఈ ఏడాది అంతర్జాతీయ స్టూడెంట్ వీసాల్లో 35 శాతం కోత విధించనున్నామనని ట్రూడో గురువారం ట్వీట్ చేశారు. 2026లోనూ విద్యార్థి వీసాల పరిస్థితి నిలకడగా ఉంటుందని, ఇది 2023 స్థాయిలతో పోలిస్తే 36 శాతం తక్కువని తెలిపారు. 2024లో లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం తగ్గింది. 2025లో జారీచేసే స్టడీ పర్మిట్ల సంఖ్య, 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించారు.