భారతీయ విద్యార్థులకు పెరగనున్న వీసా కష్టాలు
న్యూఢిల్లీ, నవంబర్ 10: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం ఆ తరువాతి పరిణామాలు తిరిగి తిరిగి చివరకు భారతీ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపె ట్టింది. ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడంతో పాటు, ఇటీవల కెనడాలో ఓ ఆలయంలో హిందువులపై దాడితో ఇప్పటికే కెనడా, భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశ కు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో కెనడా ప్రభుత్వ తాజా నిర్ణ యం అక్కడ చదవాలనుకుంటున్న విద్యార్థులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టేలా ఉంది.
విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫా స్ట్ ట్రాక్ వీసా విధానం (స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్)ను నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇక నుంచి వీసా జారీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం సహా 13 దేశాల విద్యార్థులకే ఎస్‌డీఎస్ కింద ప్రాధాన్యం దక్కే ది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మి ట్లు చాలా వేగంగా వచ్చేవి.
కెనడా తాజా నిర్ణయంతో ఆ దేశంలో చదవాలనుకునే విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విదానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తమ తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబం ధం లేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్‌డీఎస్‌ను నిలిపివేశామని వివరణ ఇచ్చింది.