calender_icon.png 15 November, 2024 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులున్నా పనులు ప్రారంభించరా?

24-09-2024 12:11:14 AM

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

హుస్నాబాద్, సెప్టెంబర్ 23: నిధులున్నా అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంపై సోమవారం రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యుత్‌శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ మండలం తంగళ్లపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుపై విద్యుత్ స్తం భాలను తొలగించకుండానే పనులు చేపట్టడంపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి సంబంధిత అధికారులకు కాల్ చేసి మందలించారు. రోడ్డుపై విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించి, ఆ తర్వాత విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల విస్తరణకు సర్కార్ నుంచి మొత్తం రూ.60 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో నే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.