వాషింగ్టన్, జూలై 10: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78), ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)కు తనతో గోల్ఫ్ ఆడాలని సవాలు విసిరారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ ఈ సవాలు విసిరారు. ఒకవేళ బైడెన్ విజయం సాధిస్తే.. బైడెన్‌కు ఇష్టమైన స్వచ్ఛంద సంస్థకు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. బైడెన్ వర్గం మాత్రం ఈ చాలెంజ్‌ను రిజెక్ట్ చేసింది.
కమలా హ్యారిస్ బీమా పాలసీ లాంటివారు!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా అధ్యక్షుడికి బీమా పాల సీలాంటి వారని ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హ్యారిస్‌ను ఉపా ధ్యక్షురాలిగా ఎంచుకోవడం బైడన్ వంకర బుద్ధికి నిదర్శనమన్నారు. ఆమెను అడ్డం పెట్టుకుని, ఆయన తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో కమలా రెండు కీలకమైన అంశాలు ఎత్తుకున్నారని, వాటిలో ఒకటి బార్డర్ సెక్యూరిటీ కాగా, మరొకటి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయకుండా ఆపడమని ఆరోపించారు. కానీ ఆమె రెండింటిలోనూ విఫలమైందని ఎద్దేవా చేశారు. ఆమె ఏనాడూ బార్డర్‌కు వెళ్లలేదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు ఆమె యూరప్ వెళ్లారని, కానీ ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. బైడన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది.
బైడెన్‌కు కాగ్నిటివ్ టెస్!్ట
అమెరికా ఎన్నికలకు సంబంధించిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత కాగ్నిటివ్ టెస్ట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. డెమోక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈ టెస్ట్ చేయించుకోవాలని పలువురు వాదిస్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా తన మానసిక సామర్థ్యాలను నిరూపించుకోవాలని కోరుతున్నారు. కాగ్నిటివ్ టెస్ట్ అనేది అభిజ్ఞా సామర్థ్యాలు, బ్రెయిన్ పనితీరు గురించి వివరిస్తుంది.