పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిజంగా పచ్చిపాలు తాగొచ్చా? పచ్చిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటారు. ఇవి ఆరోగ్యానికి బలం అంటారు. కానీ పచ్చిపాలను నెరుగా తాగడం వల్ల అనారోగ్యానికి కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో చూద్దాం..
పాలలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. అందుకే పాలను చిన్నప్పటి నుంచి అలవాటు పిల్లలకు తాగిస్తుంటారు తల్లిదండ్రులు. పాలను మరిగించి తాగడం అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పాలను మరగబెట్టడం వల్ల అందులో కనిపించే బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
అలాగే పాలను అధికంగా మరిగిస్తే దాంట్లో ఉండే విటమిన్లు తగ్గిపోతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ ప్రకారం.. లిస్టేరియా, సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా పచ్చిపాలలో ఉంటుందని వెల్లడించింది. అందుకే పచ్చిపాలను నెరుగా తీసుకోవడం వల్ల అనేక రకాలు వ్యాధులు వస్తాయని నిపుణులు అంటున్నారు. వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, అలసట వంటివి పచ్చి పాలు తాగడం వల్ల కలిగే కొన్ని లక్షణాలు.