22-04-2025 02:09:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఎవరో వచ్చి తెలంగాణకు వ్యవసాయం నేర్పలేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వెయ్యేళ్ల కిందే మన దగ్గర వరి పండించారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ రాజకీయ అపరిపక్వతతో, ఎవరి మెప్పుకోసమో మాట్లాడినట్టు ఉందని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
ఎవరినో సంతృప్తి పరిచేందుకు టీపీసీసీ చీఫ్ మాట్లాడినట్టు ఉందని, ఏ రోటీ కాడ పాటను ఆ రోటీ కాడ పాడినట్టు మీ అవకాశవాద రాజకీయాలు న్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వాన్ని అవ మానించడం సరికాదన్నారు. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, తమ నైపుణ్యంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుందని చెప్పారు.
విషయ పరిజ్ఞానం లేకుంటే పీసీసీ అధ్యక్షుడు ఎవరినైనా తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ బేషరతుగా తె లంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.