క్రికెట్ బెట్టింగ్ పేరుతో జూదక్రీడను ప్రోత్సహిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ జాడ్యం తొలగేలా లేదు. తాజాగా రఘనాథపల్లికి చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్‌కు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల పాలై చివరకు ఆత్మహత్యకు పాల్పడిన వార్త హృదయాలను కలచి వేస్తున్నది. ఒకవైపు ఆన్‌లైన్ దుర్మార్గాలు, మరోవైపు మధ్యదళారుల దోపిడీ సామాన్యులు, అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్న తీరు దారుణం. బెట్టింగ్ రోగం ఊళ్లకు కూడా వ్యాపించిందటే దాని తీవ్రత అర్థమవుతున్నది. అధికారులు ఎక్కడికక్కడ స్పందించి ఈ ముఠాలను పట్టుకొని శిక్షించాలి.
-సాత్విక్, వేములవాడ