calender_icon.png 26 December, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయు కాలుష్యాన్ని నియంత్రించలేమా?

05-11-2024 12:00:00 AM

ఢిల్లీలో బాహ్య ప్రదేశాలలో గాలి పీల్చడానికి భయపడవలసిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి తీవ్రతను అందరూ అర్థం చేసుకోవాలి. దేశ రాజధానిలో వాయు నాణ్యత అంతకంతకూ క్షీణిస్తుండడం దురదృష్టకరం. ఇటీవలి దీపావళి పండుగ సందర్బంగా వాతావరణ కాలుష్యం అక్కడ మరింత పెరిగినట్లు వార్తలు వచ్చాయి. పండుగ పూట పటాసులు కాల్చలేని దుస్థితిలోంచి ఢిల్లీని కాపాడే పాలకులే లేరా? అసలు, అక్కడ అంతేసి పొగ గాలులు ఎందుకు వీస్తున్నట్టు? ఢిల్లీతోపాటు ఆగ్రా, నోయిడాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. యమునా నదిలో అయితే పెద్ద మొత్తంలో నురగ బయటకు వస్తున్నట్టు తెలుస్తున్నది. దేశ రాజధాని, పరిసర ప్రాంతాలు ప్రజల నివాసానికి పనికి రాకుండా పోయే ప్రమాదం నుంచి పాలకులు తక్షణం కాపాడాలి. ఇందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి.

 -డి.శ్రీకాంత్‌కుమార్, బెంగళూర్