calender_icon.png 19 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీమ్స్‌లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

05-04-2025 12:00:00 AM

మంచిర్యాల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : మీమ్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్ర వారం టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) సహకారంతో క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు. గూగుల్, పేటీఎం, జస్ట్ డయల్, టాటా స్ట్రైవ్, ఎల్‌ఐసి, మారుతి సుజుకి, మెడ్ ప్లస్, ఎయిర్టెల్, పేమెంట్ బ్యాంక్, సారుస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 310 మంది గ్రాడ్యుయేట్లు, ప్రస్తుతం తృతీయ సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిమ్స్ విద్యాసంస్థల చైర్మన్, మిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ పి. ఉపేందర్ రెడ్డి, మిమ్స్ విద్యా సంస్థల కరస్పాండెంట్ టి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్లు పి శ్రీధర్ రావు, ఎం విజయ్ కుమార్, టాస్క్ స్టేట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ దీపా బారాజు, మిమ్స్ ప్లేస్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ ఎం శ్వేత తదితరులు పాల్గొన్నారు.