calender_icon.png 1 April, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

28-03-2025 12:00:00 AM

కోదాడ మార్చి 27: కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. స్కీల్ ఇంటెన్ కంపెనీలో 31 మంది సెలెక్ట్  అయినట్లు సెలెక్ట్ అయిన వారికి వార్షిక వేతనం 5.2 లక్షలు ఉంటుందని కంపెనీ హెచ్‌ఆర్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అభినందించారు.

కిట్స్ కళాశాల డైరెక్టర్  డాక్టర్ నాగార్జున రావు సెలెక్ట్ అయిన విద్యార్థులను ఆరు నెలలు ఇంటెన్షిప్ పూర్తి చేసుకొని మంచి పొజిషన్కు వెళ్లాలని సలహా ఇచ్చారు మార్చి 2025 లో జరిగిన ఈ డ్రైవ్ లో 31 మంది సెలెక్ట్ అయినా ఏప్రిల్ 04 తారీఖున కంపెనీలో జాయిన్ అవ్వాలి అని కంపెనీ హెచ్ ఆర్ ఆఫర్ లెటర్స్ మెయిల్ ద్వారా పంపారు. ఈ ఎంపికలకు కృషిచేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ అజాజ్, ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.