calender_icon.png 25 February, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర

25-02-2025 01:12:04 AM

  1. పోలింగ్ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ 
  2. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  3. నల్లగొండ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి

నల్లగొండ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): వరంగల్-ఖమ్మం, -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారా నికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెరపడనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని జిల్లాల్లో 4 గంటల తరువాత బహిరంగ సభలు, ఊరేగింపులు, సమా వేశాలు, రాజకీయంగా ప్రేరేపించే సంక్షిప్త సందేశాలు, ఎస్ ఎంఎస్లు పంపడం నిషేధమని రిటర్నింగ్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో సందేశాలపైనా నిఘా ఉంటుందని వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 చట్టాల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్కు 48 గంటల ముందు జిల్లాయేతర వ్యక్తులు జిల్లాలో ఉండొద్దని స్పష్టం చేశారు.  ఒపీనియన్,  ఎగ్జిట్ పోల్స్ నిషేధమని వెల్లడించారు.

మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపైనా నిషేధం విధిస్తున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మార్చి 3న  నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.