calender_icon.png 27 February, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

18-02-2025 06:32:02 PM

బిచ్కుంద (విజయక్రాంతి): ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మంగళవారం బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పట్టబద్రుల ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు, బిజెపి సీనియర్ నాయకులు ముత్యం పిరాజి, బద్రి సాయిలు, భూత్ అధ్యక్షులు వంశీ, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.