calender_icon.png 24 February, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

24-02-2025 12:00:00 AM

మద్నూర్, ఫిబ్రవరి 23( విజయక్రాంతి),: కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆదివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార, ధన్నూరు, సోపూరు, చిన్న ఎక్లార, మేనూరు గ్రామాలలో పట్టబద్రుల ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హనుమంతు యాదవ్, విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు దేశాయి, ముగుడే బస్వంత్, సోమ వార్ మహేష్, హనుమాన్లు స్వామి, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.