ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం
ఇంటింటి ప్రచారం చేస్తూ అధ్యాపకులు
వాంకిడి, (విజయక్రాంతి): స్థానిక వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు మండలంలోని బంబార గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. భవిష్యత్తు మీది.. ఆ భవిష్యత్తుకు భరోసా మాది అంటూ వాంకిడి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య అధ్యాపక బృందం పదో తరగతి పాసైన విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కల్పిస్తూ, వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని వారు సూచించారు.
ఎటువంటి అడ్మిషన్ ఫీజు ఉండదని, పుస్తకాలు ఉచితంగా అందజేస్తామన్నారు. మండలంలోని విద్యార్థులు ప్రవేట్ కళాశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ కళాశాలలో చేరాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ, ఉప సర్పంచ్ జాడే సంతోష్ కుమార్, అధ్యాపకులు ఉన్నారు.






