17-04-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజా పంపిణీ వ్యవస్థ లో చౌక ధరల దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరాపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, అస త్య ప్రచారాలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంద ని జిల్లా అదనపు కలెక్టర్ సబావాత్ మోతిలాల్ బుధవారం తెలిపారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తు న్న సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని -తిలక్‌నగర్‌లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలి సాయని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఎక్స్‌లలో వీడియోలు ప్రచారం చేశారని, ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్పందించి తిలక్‌నగర్‌లో ఎటువంటి ప్లాస్టిక్ బియ్యం సరఫరా జరగలేదని, అసత్య ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.