22-02-2025 01:16:20 AM
నాగల్ గిద్ధ, ఫిబ్రవరి 21 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకులు ప్రచారం చేశారు. శుక్రవారం నాగల్ గిద్ధ మండలంలో ముక్తాపూర్, వల్లూరు, మార్గి, షాపురే, లో బిజెపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ జి నాగపురి ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది . ప్రభుత్వం 317 జీవోతో ఉపాధ్యాయుల ఉసురు తీసిందని, గ్రూప్ నియామకాల్లో 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసి అభ్యర్థులకు అన్యాయం చేసింది నోటిఫికేష న్ల ఇవ్వక నిరుద్యోగుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందిన్నారు .
ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు, డీఏలు, పదోన్నతులు వంటి ప్రతీ అంశం లోనూ నమ్మించి నట్టేటా ముంచిందన్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామా బాద్ ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపర్చిన అభ్యర్థులను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యకు ఓటు వేసి గెలిపిం చాలని కోరారు. ఈ ప్రచారంలో ప మండ ల్ ప్రధాన కార్యదర్శి రాజు స్వామి, బీజీవై ఎం మండల్ అధ్యక్షులు రమేష్ , నాగశెట్టి పాటిల్,బి రాజ్కుమార్ మాజీ సర్పంచ్, చప్తా బసవరాజ్, అంజన్న,జగన్నాథ్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు.