అర్మూర్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోలా వెంకటేష్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీసాల రవి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సంద ర్బంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అనుసరించవలసిన వ్యూహాలు, నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీలో సంస్థగత పదవుల భర్తీ పై చర్చ జరిగింది.
కులగనన ప్రజల్లో వస్తున్నా స్పందన గురించి మరియు ప్రభుత్వ పని తీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు గురించి అడిగి తెలుసుకున్నాడు, ప్రతిపక్షాలు ప్రభుత్వం పై చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పి కొట్టాలని, ప్రభుత్వ కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు వెంకటేష్ తెలిపారు.