14-02-2025 01:38:38 AM
ముంబై: రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా కోలా తన బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా ఈ విభా గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కోకాకోలా వంటి అంతర్జాతీయ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా 2025 కో-ప్రెజెంటర్ హక్కుల్ని దక్కించుకుంది. ఇందుకోసం రూ.200 కోట్లు వెచ్చించ నుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఈ కో- ప్రెజెంటింగ్ హక్కుల్ని కోకాకోలాకు చెందిన థమ్స్ అప్ రూ. 200 కోట్లకు దక్కించుకుంది. ఇదే మొత్తానికి కాంపా కోలా ఈ ఏడాది కో-ప్రెజంటర్‌గ్గా వ్యవహరించనుంది.