calender_icon.png 11 March, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాంపు కార్యాలయమా?.. పార్టీ ఆఫీసా..?

11-03-2025 12:40:28 AM

ఝాన్సీరెడ్డిపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు

జనగామ, మార్చి 10(విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పార్టీ మీటింగుకు వినియోగించుకున్న పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డే ఎమ్మెల్యేగా ఊహించుకుంటున్నారన్నారు. రాజకీయంపై ఎలాంటి అవగాహన లేకుండా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల స్వయంగా పాలకుర్తిలోని అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించారన్నారు.

కేవలం బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడం కోసం అధికారిక కార్యాలయాన్ని వినియోగించుకోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినందుకు ఆమెపై 1951 సెక్షన్ 123(7) ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పుస్కూరి శ్రీనివాస్‌రావు, అల్లం ప్రదీప్‌రెడ్డి, సురేశ్, మల్లేశ్‌తదితరులు పాల్గొన్నారు.