calender_icon.png 21 April, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సౌకర్యార్థం క్యాంప్ కార్యాలయం ప్రారంభం

21-04-2025 01:24:40 AM

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

మందమర్రి, ఏప్రిల్ 20 : పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం సీఈఆర్ క్లబ్ సమీపంలోని బి1 క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంను ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగ పడుతుందన్నారు. పట్టణం అభివృద్ధితో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. పట్టణ, మం డల ప్రజలు క్యాంప్ కార్యాలయం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ,అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.