calender_icon.png 12 December, 2024 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బురఖాలో వచ్చి కత్తితో దాడి

12-12-2024 12:49:56 AM

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఘటన

భైంసా, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తన భర్త సోదరిపై ఓ మహి ళ బురఖాలో వెళ్లి దాడి చేసిన ఘటనలో నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. బైంసా మండలం బోరిగాంకు చెంది న హనుమంత్‌రావు ముథోల్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తూ భార్య అశ్వి ని, కుమారుడితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అశ్విని మూడు నెలల క్రితం మరో బిడ్డకు జన్మించడంతో భైంసాలోని పుట్టింటి వారు తీసుకెళ్లారు.

హనుమంత్‌రావు, అత ని కుమారుడికి వంటకు ఇబ్బంది కావడంతో సహాయంగా ఉంటుంద ని తన సోదరి రిచాను తెచ్చుకున్నా డు. బుధవారం కుమారుడిని వెంట పెట్టుకుని హనుమంత్‌రావు బయట కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్విని బురఖా వేసుకుని ముథోల్‌లో ఇంటికి వెళ్లింది. ఒంటరి గా ఉన్న రిచాపై కత్తితో దాడిచేసింది. ఈ క్రమంలో రిచా అరుపులు విన్న స్థానికులు వెంటనే వచ్చి అశ్వినిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రిచాను భైంసా ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితురాలు తమ అదుపులో ఉన్నదని, అయితే ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.