పోలీసులకు చిక్కిన గంజాయి గ్యాంగ్
మహబూబాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తుపాకీ తూటాలు అమ్మేందుకు వచ్చిన గంజాయి గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 2020 సంవ త్సరంలో ఓ గంజాయి కేసులో మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన అందెం గోపి, రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ భారతి రాజమండ్రి జైలుకు వెళ్లారు.
అక్కడ వీరికి కేరళకు చెందిన చంద్రశేఖర్, జయరాం పరిచయమయ్యారు. గో పిని చంద్రశేఖర్ తనకు బిజినెస్ కో సం తుపాకీ కావాలని అడగ్గా రాజస్థాన్ రాష్ట్రంలోని ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడి తుపాకీని, రెండు తూటా లను ఇప్పించారు. ఆ తర్వాత తనకు ఆ తుపాకీ అవసరం లేదని చెప్పడంతో దాన్ని ఎక్కువ ధరకు అమ్మేం దుకు సోమవారం కారులో ఈ ము ఠా సభ్యులు కేసముద్రం వచ్చారు.
కారులో తుపాకీని పెట్టుకుని తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచా రించగా వీరారెడ్డిపల్లి రెడ్లవాడలో దొంగతనాలకు కూడా పాల్ప డ్డట్టు నిందితులు తెలిపారు. ఆయా ఘటనల్లో ప్రమేయం ఉన్న గోపి, ప్రవీణ్ భారతి, శ్రీకాంత్‌రెడ్డి, సందీ ప్, సిద్దార్ధలను అరెస్టు చేసి వారి నుంచి తుపాకి, రెండు తూటాలు, కారు, 5 మొబైల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.