calender_icon.png 23 December, 2024 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేలరీలకో లెక్కుంది

19-10-2024 12:00:00 AM

మనం ఏవి తిన్నా మన బాడీలోకి కొంతశక్తి వెళ్తుంది. దాన్నే మనం కేలరీలు అంటాం. మనం తినే బిర్యానీలు. తాగే కూల్ డ్రింక్స్.. తీసుకునే స్నాక్స్.. బట్టి కేలరీలకు లెక్కలుంటాయి. అలాగని ప్రతీదీ లెక్కలేసుకుంటూ తినలేం. రోజుకు ఎవరు ఎన్ని కేలరీలు తీసుకోవాలి? అనేదానికి కచ్చితమైన లెక్క లేదు. వయసును బట్టి కూడా ఈ లెక్కలు మారుతుంటాయట. సగటు మనిషికి ఎన్ని కేలరీలో అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. 

కేలరీలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే శరీరం బాగా పనిచేయడానికి అవసరమైన శక్తినిస్తాయి. అయితే ఒక చీజ్ పిజ్జా తింటే అందులో దాదాపు 200- 300 కేలరీలు శరీరానికి అందుతాయి. అలాగే చాక్లెట్ కుకీలో 150--200 కేలరీలు ఉంటాయి. బటర్ చికెన్ 400--600 కేలరీల ఉంటాయి. అయితే ఇటీవల చాలామం ది ఆహారం తినే ముందు కేలరీల సంఖ్యను అంచనా వేస్తున్నారు.

నడిచేటప్పుడు, పనిచేసేటప్పుడు శరీరానికి తగినంత కేలరీలు అవ సరం. తగినంత శక్తి లేకపోతే కణాలు చనిపోయి ఊపిరితిత్తులు, గుండె వంటి అవ యవాల పనితీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిఒక్కరు కేలరీల గురించి అవగాహన ఉండాలంటున్నారు వైద్యులు. 

ఏయేవాటిలో ఎంత 

* 1 గ్రాము కార్బోహైడ్రేట్లలో 4 కిలో కేలరీలు 

* 1 గ్రాము ప్రోటీన్ 4 కిలో కేలరీల

* 1 గ్రాము కొవ్వులో 9 కిలో కేలరీలు 

ఎన్ని కేలరీలు అవసరం

బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ పవిత్ర ఎన్.రాజ్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తికి ఎన్ని కేలరీస్ అవసరమ నేది వాళ్ల  లైఫ్‌స్టైల్, పనితీరును బట్టి ఉంటుంది. అయితే సాధారణ మహిళకు 1,400 నుం చి 1,600 కిలో కేలరీలు అవసరం కావచ్చు. మగవారికి 1,800 నుంచి 2,000 కిలో కేలరీలు అవసరం అని చెప్పారామె. ఎత్తు, శరీ ర బరువు, ఆకారం, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

* నుంచి 18 ఏళ్ల పిల్లలకు

* 1-6 నెలలు: కిలోకు 90 కిలో కేలరీలు

* 7-12 నెలలు: కిలోకు 80 కిలో కేలరీలు

* 1-3 సంవత్సరాలు: కిలోకు 83 కిలో కేలరీలు

* 4--6 సంవత్సరాలు: కిలోకు 74 కిలో కేలరీలు

* 7--9 సంవత్సరాలు: కిలోకు 67 కిలో కేలరీలు

* 10--12 సంవత్సరాలు: అబ్బాయిలు కిలోకు 64 కిలో కేలరీలు, అమ్మాయిలకు కిలోకు 57 కిలో కేలరీలు

* 13--15 సంవత్సరాలు: అబ్బాయిలకు కిలో 57 కిలో కేలరీలు, అమ్మాయిలకు 49 కిలో కేలరీలు 

* 16--18 సంవత్సరాలు: అబ్బాయిలకు కిలోకు 52 కిలో కేలరీలు, అమ్మాయిలకు కిలోకు 45 కిలో కేలరీలు

* చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు, బిస్కెట్లు, అలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిల్లో కేలరీలు ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. నడవడం, మాట్లాడటం, తినడం చేస్తున్నాం. అయితే.. ఈ ప్రక్రియలతో ఆ కేలరీలన్నీ కరగవు. మిగతా కేలరీలు మన శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి. అలాంట ప్పుడు కేలరీలపై అవగాహన ఉండాలి