కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ డివి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు పూర్తి అయినందున ఓ.ఎం.ఆర్. జవాబు పత్రాలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, పరిశీలకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.