24-02-2025 12:22:07 AM
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కుమ్రం భీం అసిఫాబాద్,ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షలు జరిగా యి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టి. జి. సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కొరకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం జరి గిందని తెలిపారు.
జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 3 వేల 893 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 98.33 శాతంతో 3 వేల 828 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
అభ్యర్థుల సౌకర్యాలు త్రాగునీరు, నిరంతర విద్యుత్, పరీక్ష కేంద్రాలలో వైద్య సిబ్బంది, అవసరమైన మందులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆర్. టి. సి. ఆధ్వర్యంలో బస్సులు నడిపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.