calender_icon.png 27 September, 2024 | 10:53 PM

ప్రశాంతంగా రెండోదశ పోలింగ్

26-09-2024 02:33:26 AM

  1. జమ్ముకశ్మీర్‌లో 26 స్థానాలకు ఎన్నికలు
  2. 57.03 శాతం ఓటింగ్ నమోదు

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 25: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండోదశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించగా 25 లక్షల మందికి పైగా ఓటేశారు. రాత్రి 11.45 గంటల వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 57.03 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. 

అత్యధికంగా రియాసి జిల్లాలో 74.70 శాతం ఓటింగ్ నమోదు కాగా, శ్రీనగర్ జిల్లాలలో అత్యల్పంగా 29.81శాతం ఓటింగ్ రికార్డ య్యింది. ఇంతకు ముందు ఈనెల 18న జరిగిన తొలిదశలో 63.75 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా అక్టోబర్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది.