27-02-2025 04:04:57 PM
జిల్లా ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన27 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో కలిపి 54 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగినట్లు తెలిపారు.ఉపా ధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 54 పోలింగ్ కేంద్రాలకు 312 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు ఎస్పీ సింధు శర్మ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల నుంచి సిల్ చేసిన పోలింగ్ బాక్సులను పోలీస్ బందోబస్తు మధ్య గోదాములకు తరలించడం జరిగింది అన్నారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ కు సహకరించిన పట్టబద్రులు ఉపాధ్యాయులకు వివిధ పార్టీల నాయకులకు అభినందనలు ఎస్పీ తెలిపారు. ఎస్పీ సింధు శర్మతో పాటు అడిషనల్ ఎస్పీలు చైతన్య రెడ్డి నరసింహారెడ్డి డిఎస్పీలు శ్రీనివాసులు సత్యనారాయణ సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.