బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం ఒక కరువు భత్యం విడుదల చేసి దీపావళి కానుకగా చిత్రీకరించండం హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ పేర్కొన్నారు. రెండు జాక్‌లతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం మూడ డీఏలు చెల్లిస్తారని ఉద్యోగులు భావిస్తే మంత్రివర్గం కేవలం ఒక్కటి విడుదల చేయడం ఉద్యోగులను అవమానించడమేనని విమర్శించారు.
కనుచూపు మేరలో పీఆర్సీ జాడ లేదన్నారు. హె ల్త్ కార్డ్స్, 317 జీవో, సీపీఎస్ లాంటి సమస్యలపై సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మార్చి నుంచి పదవీ విరమణ చేసిన దాదాపు 6 వేల మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆశా, అంగన్వాడీ, ఐకేపీ, కాంట్రాక్ట్, ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఆదా యం పెరిగిందని ఒక వైపు చెబుతూనే మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగులు అర్థం చేసుకోవా లని ఉపదేశించడం ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.