calender_icon.png 4 April, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల పోరుగర్జనకు రాహుల్‌గాంధీని పిలవండి

29-03-2025 12:00:00 AM

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ను కోరిన జాజుల

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (విజయక్రాంతి):బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏప్రిల్ 2న నిర్వహించబోయే బీసీల పోరు గర్జన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హాజరయ్యేలా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శుక్రవారం మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసి బీసీ సంక్షేమ సంఘం బృందం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం తెలంగాణ అసెంబ్లీలో పెంచిన రిజర్వేషన్లను పార్లమెంట్‌లో కూడా బిల్లు ఆమోదించాలని కోరుతూ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వేలాది మందితో ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపా రు. బీసీల ఆందోళనకు రాహుల్‌గాంధీ హాజరయ్యేలా చూస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, ఎస్‌దుర్గయ్యగౌడ్, ఎ స్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షడు నరసింహనాయక్, బీసీ సంఘాల నాయకులు సింగం నగేష్, ఈడిగ శ్రీనివాస్, నాగరాజుగౌడ్, భాస్కర్ పాల్గొన్నారు.