calender_icon.png 25 October, 2024 | 8:59 AM

చర్చలకు పిలవండి

13-08-2024 12:51:13 AM

  1. సమస్యలు వెంటనే పరిష్కరించండి
  2. గత ప్రభుత్వంలాగే మీరూ చేయొద్దు
  3. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సూచన
  4. 53 సంఘాలతో టీజేఏసీగా ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ‘మాతో చర్చించండి.. మా సమస్యలను పరిష్కరించండి.. లేదంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం’ అని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పరిష్కరించాలని కోరింది.

సమస్యల పరిష్కారానికి మరో 15 రోజుల్లో తమ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్న ది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ టిఎన్‌జీవో భవన్ సోమవారం ‘తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సన్నాహాక సమావేశం’ జరిగింది.

ఈ సమావేశానికి  పీఆర్టీయూటీఎస్ పింగలి శ్రీపాల్ రెడ్డి, ఎస్‌టీయూటీఎస్ నాయకులు సదానందం గౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, యూటీఎఫ్ నాయకులు చావ రవి, తెలంగాణ గ్రూప్ అధికారుల సంఘం నాయకుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు పీ యాదగిరి గౌడ్, టీఆర్టీఎఫ్ నేత అంజిరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకుడు పీ మధుసూదన్‌రెడ్డి, టీటీఏ నాయకుడు హరికృష్ణ, టీపీటీఎఫ్ నాయకుడు అశోక్‌కుమార్‌తోపాటు 53 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

పాత పెన్షన్‌కు మళ్లాలి

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్ష న్ విధానాన్ని అమలు చేయాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగుల చందాలతో కూడిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని, నాలుగు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 15 మందితో స్టీరింగ్ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఉపాధ్యా యులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమ లు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్ల తదితర సమస్యల పరిష్కారానికి త్వరలోనే మరోసారి సమావేశమై భవి ష్యత్ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు. 

గచ్చిబౌలి టీఎన్ రెండో దఫాలోని 101.02 ఎకరాల స్థలంపై సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. 317 జీవోలోని లోపాలను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. అంత ర్ జోనల్ భార్యాభర్తల బదిలీలు చేపట్టాలని, మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ర్టస్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో సహా అందరికీ నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. అన్ని జిల్లాలకు డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని, సమగ్రశిక్షలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాం డ్ చేశారు. మోడల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో గట్టిగా అడిగే పరిస్థితి లేదు: మారం జగదీశ్వర్

గత ప్రభుత్వంలో ఉద్యోగులు తమ హక్కులను గట్టిగా అడిగే పరిస్థితులు ఉండలేదు. ని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఇష్టమొచ్చినట్టుగా జోనల్ వ్యవస్థను మార్చి, 317 జీవో పేరుతో ఉద్యోగులను ఎక్కడికక్కడ విచ్ఛి న్నం చేశారని విమర్శించారు. గతంలో తాము ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉన్నామని, అధికార పార్టీకి కాద ని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం లో పనిచేసిన వారిని, సంఘాలను విచ్ఛి న్నం చేశారని, చివరకు ధర్నాచౌక్ కూడా రద్దు చేశారని, అందుకే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం చేయకూడదని సూచించారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, అందుకే ఇప్పటి వరకు వేచిచూశామని తెలిపారు. 

హామీలు నెరవేర్చాలి: ఏలూరి శ్రీనివాసరావు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు. గత ప్రభుత్వం జేఏసీ, ఉద్యోగ సంఘాలపై అనేక ఆంక్షలను విధించిందని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఇప్పటికీ ఉన్నాయని, ఇందులో ముఖ్యమైన సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.