15-02-2025 01:27:18 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో సాక్షి పిటిషన్‌పై హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులపై నమోదైన కేసులో సాక్షిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా మాత్రమే విచారణకు పిలవాలంటూ పోలీసులకు శుక్ర వారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది.
అయితే విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న అభ్యర్థన ను తిరస్కరించింది. పంజాగుట్ట పోలీసులు నిర్ధిష్ట సమయం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు పిలుస్తూ వేధింపులకు గురి చేయడాన్ని సవాలు చేస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వంశీకృష్ణ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకెళ్తున్నారని, రాత్రి వరకు ఉంచుకొని వదిలిపెడుతున్నారన్నారు. వాదనలు విన్న న్యాయ మూర్తి పిటిషనర్‌ను విచారణకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోగా మాత్రమే పిలవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.