calender_icon.png 8 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు అఖిలపక్ష సమావేశం పెట్టండి

03-11-2024 02:14:23 AM

మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నా రు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నిర్వహించే జనగణ న కు చట్టబద్ధత ఉన్నట్లే, బీసీ కులగణనకు సైతం చట్టబద్ధత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చా కే ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలన్నారు. హైకోర్టు కులగణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. చట్టా న్ని రూపొందించకుండా సర్వే చేపడుతున్నారని, రెండు వేర్వేరు జీవోలు తేవడంతో గందరగోళం నెలకొందన్నారు.