calender_icon.png 7 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలిఫోర్నియా కమలదే!

07-11-2024 02:08:27 AM

గోల్డెన్ స్టేట్‌గా పేరున్న కాలిఫోర్నియాకు అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. రాష్ట్రం డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట. ఈసారి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థి కమల హ్యారిస్ విజయం సాధిస్తారని అనేక సర్వేలు వెల్లడించాయి. ఊహించినట్లుగానే ఆమె 54 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి ఎన్నికల్లో గెలుపొందారు.

కమలా హ్యారిస్ 59.5 శాతం ఓట్లు సాధించగా, డోనాల్డ్ ట్రంప్ 38.1 ఓట్లు సాధించారు. గతంలో కమలా హ్యా రిస్ ఇక్కడి నుంచే అటార్నీ జనరల్‌గా, యూఎస్ సెనెటర్‌గా పని చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో 1988 నుం చి ఇప్పటివరకు ఏ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థునా గెలుపొందలేదు. దీన్నిబట్టి ఇక్కడ  డెమోక్రటిక్ పార్టీ ఎంత బల ంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇమ్మిగ్రేషన్, మహిళలకు అబార్షన్ హక్కులు, పౌరుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై  కమలా హారిస్ ఇచ్చి న హామీలు కాలిఫోర్నియా పౌరులను ఆకర్షించాయి. ఎన్నికల ఘన విజయానికి ఆమె ప్రభావశీలకంగా ప్రచారం నిర్వహించడం ఓ కారణం.