calender_icon.png 31 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుత దాడిలో లేగదూడ మృతి

30-01-2025 03:42:38 PM

కామారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం(Lingampet Mandal of Kamareddy District)లోని లింగంపల్లి గ్రామానికి చెందిన చౌడం స్వామికి చెందిన లేగ దూడపై బుధవారం రాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితుడు స్వామి తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన చౌడం స్వామికి లింగంపేట పెద్ద వాగు సమీపంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న తన  పంట చేను వద్ద రోజు వారీగా పశువులను అక్కడే షెడ్డులో కట్టేసేవాడు.రోజు లాగానే బుధవారం కూడా సాయంత్రం పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చారు.

తెల్లవారుజామున పొలం వద్ద ఉన్న కొట్టంలో చూడగా లేగదూడ చనిపోయి ఉంది. దీంతో బాధితుడు స్థానికులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వినోద్ బీట్ ఆఫీసర్ లింగయ్య బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్ లు సంఘటన స్థలానికి చెరుకుని పశువైద్యాధికారులకు సమాచారం అందజేశారు. మృతి చెందిన లేగ దూడకు పశు వైద్యాధికారులు పంచనామ నిర్వహించారు. చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.దీంతో లింగంపల్లి పెద్దవాగు సమీపంలోకి వెళ్లాలంటేనే గ్రామస్తులు,రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు జంకుతున్నారు.