calender_icon.png 8 January, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ల ఆవిష్కరణ

06-01-2025 12:00:00 AM

కరీంనగర్ సిటీ, జనవరి 5: కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘాలు ముద్రించిన టేబుల్ క్యాలెండర్లను టీఎన్జీవో జిల్లా సంఘం కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, కేంద్ర సంఘం నాయకులతో కలిసి సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్క రించారు. ఆదివారం నగరంలోని టీఎన్జీవో భవన్లో జరిగింది.

అలాగే  లూయిస్ బ్రెయిలీ జన్మది నం సందర్భంగా బ్లైండ్ ఉద్యుగులకు చెందిన కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ  సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్లైండ్ ఉద్యోగులకు టీఎన్జీ వోల సంఘం ఎల్లపుడూ సహాయ సహకారాలు అందిస్తుని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్ర మంలో  కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్,  సర్దార్ హర్మీంధర్ సింగ్ జిల్లా సంఘం కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, సహద్యక్షులు ఓంటేల  రవీందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్,  వ్యవసాయ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ, కార్యదర్శి లవ కుమార్, నాయకులు భూమయ్య మల్క రాజేశ్వరరావు బోనాల రవి, కరుణాకర్, షేక్ అంజద్, గాజుల రవి, శేషగిరి,  పూర్ణచందర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, అరుణ, విజయ్, బేగ్, బ్లైండ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గురు ప్రసాద్, సెక్రటరీ జి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.