calender_icon.png 19 February, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌ఎస్ సభకు కలకత్తా హైకోర్టు అనుమతి

15-02-2025 01:18:30 AM

కోల్‌కతా, ఫిబ్రవరి 14: పశ్చిమ బెంగాల్‌లోని బుర్దాన్‌లో ర్యాలీ నిర్వహించుకోవా డానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తక్కువ మోతాదులో శబ్దం విడుదలయ్యేలా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 16న బుర్దాన్ లో జన్ సభ పేరిట బహిరంగ సభ నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళిక రూపొందిం చుకుంది.

ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సభ నిర్వహణ కోసం అనుమతి కోరుతూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు బెంగాల్ పో లీస్ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే సెకండరీ పరీక్షలను సాకుగా చూపి సభ నిర్వహ ణకు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆ ర్‌ఎస్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సభ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే లౌడ్ స్పీకర్ల ద్వారా ఎక్కువ మొత్తంలో శబ్దా న్ని విడుదల చేయొద్దని సూచించింది.