calender_icon.png 7 March, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కఫిసో విశిష్ట మహిళా పురస్కారాలు

07-03-2025 12:35:42 AM

కరీంనగర్, మార్చి6 (విజయక్రాంతి): కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రతి ఏటా ప్రధానం చేసే కఫీసో విశిష్ట మహిళ పురస్కారానికి 2025వ సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖ మహిళలను ఎంపిక చేసినట్లు కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం  డా.రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మి గౌతమ్ తెలిపారు. ప్రఖ్యాత రచయిత్రి తంగేళ్ల శ్రీదేవి రెడ్డి, ప్రముఖ గాయని కనకవ్వ, ప్రసిద్ధ నర్తకి గుత్తా నాగదుర్గ లకు కఫీసో శిష్ట మహిళా పరిష్కారాలను ప్రధానం చేయనున్నట్లు  తెలిపారు.

కరీంనగర్ ఫిలిం భవన్ లో మహిళా దినోత్సవం రోజు మార్చ్ 8న సాయంత్రం 6 గంటలకు పురస్కార ప్రధానోత్సవ సభ నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. తంగేళ్ల శ్రీదేవి రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ప్రముఖ తెలుగు రచయిత్రి. నవలల తో పాటు కథలు కవితలు రాశారు. బతుకమ్మ బోనాలు లాంటి సందర్భాలలో అనేక పాట లు రాశారు. వివిధ అంశాలపై గొప్ప వ్యాసా లు రాశారు.

దొరసాని సినిమాలో హీరో చెప్పే కవితలలో కొన్ని కవితలు శ్రీదేవి రాశారు. గతంలో తెలుగు విశ్వ  విద్యాలయం కీర్తి పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు పొందారు. గొట్టే కనకవ్వ ప్రసిద్ధ జానపద గాయని. ఆమె సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లి గ్రామ వాస్తవ్యురాలు. చిన్నప్పటినుండే నాటు వేసేందుకు కలుపు తీసేందుకు వెళ్లినప్పుడు తన తల్లి నుంచి జానపద పాటలు నేర్చుకుంది. యూట్యూబ్ ఫోక్ స్టార్ గా అందరికీ సుపరిచితురాలు. కొన్ని సినిమాలలో నటించింది. గుత్తా నాగదుర్గ ప్రసిద్ధ నృత్య కళాకారిణి. నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం స్థాపిం చి వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. యూట్యూ బ్ సెన్సేషన్‌గా అందరికీ సుపరిచిత్రాలు.