క్యూ2లో 15 బిలియన్ డాలర్లు
ముంబై, డిసెంబర్ 5: భారత్ కరెంటు ఖాతా లోటు (క్యాడ్) ఈ జూలై త్రైమాసికంలో 1.6 శాతానికి చేరింది. ఇంతగా క్యాడ్ పెరగడం గత ఏడు త్రైమాసికాల్లో ఇదే ప్రధమం. అంకెల్లో చూస్తే జూలై క్యాడ్ 15 బిలియన్ డాలర్లని (జీడీపీలో 1.6 శాతం), అంతక్రితం జూన్ త్రైమాసికంలో 9.8 బిలియన్ డాలర్లని (1.1 శాతం) ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. నిరుడు క్యూ3లో నమోదైన 16.8 బిలియన్ డాలర్ల (2 శాతం) క్యాడ్ తర్వాతే ఇదే అధికమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గినందున వస్తూత్పత్తుల ఎగుమతులు క్షీణించడంతో క్యాడ్ పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ వివరించింది.