calender_icon.png 23 December, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్తనడకన తీగల వంతెన పనులు

07-10-2024 12:00:00 AM

వరదలకు దెబ్బతిన్న పిల్లర్లు

వ్యయం పెంచేందుకు ప్రతిపాదనలు 

వంతెన పూర్తయితే తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు

ఖమ్మం, అక్టోబర్ ౬ (విజయక్రాంతి): ఖమ్మంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం టలో మంజూరైన ఈ వంతెన పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.

రూ.180 కోట్లతో నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన పటేల్ కనస్ట్రక్షన్ సంస్థ దక్కించుకున్నది. అయితే వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పాటు ఈ మధ్య కాలంలో మున్నేరుకు పెద్ద ఎత్తున వరదలు రావడం తో పనులు ముం దుకు సాగని పరిస్థితి ఏర్పడింది.

వరదల కంటే ముందు పనులు ఊపందుకున్నప్పటికీ భారీ వరాల వల్ల నిలిచిపోయాయి. అంతేకాకుండా పిల్లర్లు పూర్తి గా వరదల్లో మునిగిపోవడంతో కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మున్నేరుపై వంతెన నిర్మాణం

ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి లో కాల్వొడ్డు వద్ద మున్నేరుపై దీనిని నిర్మిస్తున్నారు. 150 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారు నిర్మిం చిన పాత వంతెన పక్కనే ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి కేబుల్ బ్రిడ్జి లు ఇప్పటికే మూడు చోట్ల ఉన్నాయి. ఖమ్మం లో పర్యాటక ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెనను నిర్మించారు.

మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన మాత్రం నగరంలో పెరి గిపోయిన ట్రాఫిక్ నియంత్రణ కోసమే చేపట్టారు. ప్రస్తుతం నగరంలో మున్నేరుపై మూ డు చోట్ల బ్రిడ్జిలు న్నాయి. కాల్వొడ్డులోను, కరుణగిరి, ప్రకాశ్‌నగర్ వద్ద వంతెనలు ఉన్నాయి. వాటిలో కాల్వొడ్డులో ని వంతెన  శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలు నిషేధించారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి కూడా పాడైపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఒక్క కరుణగిరి వంతెన మీద నుంచే రాకపోకలు కొసాగుతుండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న ది. ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు వంతెన సమీపంలోని మున్నే రు పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా కూడా అభివృద్ధి చేయాలనే తలంపు తోనే తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. 

9 పిల్లర్లతో నిర్మాణం

మొత్తం తొమ్మిది పిల్లర్లతో తీగల వం తెనను నిర్మిస్తున్నారు. 420 మీటర్ల పొడవుకు గాను 300 మీటర్లు కేబుల్ వైర్లు, మిగతా 120 మీటర్ల మేర ఆర్‌సిసి నిర్మా ణం చేపట్టనున్నారు. ఇది పూర్తయి  తేనగరంలో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు టూరిజం అభివృద్ధికి అవకాశం ఏర్పడుతు ంది.

ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా లభిస్తుంది. వరదల వల్ల నిర్మాణం లో ఉన్న పిల్లర్లు దెబ్బతినడంతో నిర్మాణ  వ్యయాన్ని రెట్టింపు చేసే ందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి పం పినట్లు తెలిసింది. ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణ లో జరుగుతున్న తీగల వంతెనను త్వరగా పూర్తి చేసి, ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.