calender_icon.png 31 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం గుమ్మంలో తీగల వంతెన

31-01-2025 12:26:41 AM

  1. 16 పిల్లర్లతో 300 మీటర్ల మేర నిర్మాణం
  2. నిర్మాణానికి రూ.180 కోట్ల వ్యయం 
  3. మంత్రి తుమ్మల ఆదేశాలతో శరవేగంగా పనులు 

ఖమ్మం, జనవరి 30 (విజయక్రాంతి): మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఖమ్మం మున్నేరుపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన తీగల వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో నిర్మించిన పిల్లర్లు గత వరదల్లో మునిగిపోవడంతో పాటు భూసేకరణలోనూ జాప్యమవడంతో ఇన్ని రోజులు పనులు నత్తనడకన సాగాయి.

వరదలు తగ్గిన తర్వాత మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవడంతో ప్రస్తతం శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో నిర్మిస్తున్న ఈ తీగల వంతెన ఖమ్మం నగరానికే తోరణంగా నిలువబోతుంది. 

చుట్టుపక్కల భూములకు డిమాండ్

గత ప్రభుత్వ హయాంలో ఈ వంతెన మంజూరైనప్పటికీ పలు కారణాల వల్ల ముందుకు సాగలేదు. దాదాపు రూ.180 కోట్ల వ్యయంతో భారీఎత్తున నిర్మిస్తున్న తీ  వంతెన పూర్తయితే ఖమ్మం నగరం ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. చుట్టుపక్కల భూములకు డిమాండ్ ఎక్కువవుతుంది.

తాజాగా బ్రిడ్జికి అవతల ఉన్న ఏదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు, నాయుడుపేట, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాలను కలిపి మున్సిపాలిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నే  తీగల వంతెన నిర్మాణంతో నూతన ము  వరప్రసాదమేనని చొప్పొచ్చు. మొత్తం 16 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు అన్ని పిల్లర్లు పూర్తి కావొచ్చాయి.

ఈ పిల్లర్లపై ప్రీకాస్ట్ స్లాబ్‌లను బిగించేందుకు అధికారులు సిద్ధ్దమ  మొత్తం 128 సెగ్మెంట్లను కలిపి 21 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్ల రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. దీనిపై రెండు వైపు  పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ తీగల వంతెనను మున్నేరుపై 300 మీటర్ల మేర నిర్మిస్తున్నారు. 

వచ్చే ఏడాది పూర్తి..

గతంలో ఈ మార్గంలో కొంతమంది గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని నివాసముండటంతో భూసేకరణ కష్టమైంది. మంత్రి తుమ్మల జోక్యంతో వారికి ప్రత్యామ్నాయం చూపించేందుకు చర్యలు తీసుకో  భూసేకరణ కార్యక్రమం కూడా పూర్తి కావొచ్చింది. దీంతో రెండువైపులా అప్రోచ్ రోడ్డుకు అడ్డంకులు తొలిగాయి. 2026, మార్చి నాటికి పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.

కానీ దీని పక్కనే ఉన్న వందేళ్ల పురాతన వంతెనను మూ , కింద ఉన్న చప్టాపై నుంచి తాత్కాలికంగా రాకపోకలు ప్రారంభించారు. వర్షాలు వస్తే ఈ చప్టా నీటిలో మునిగిపోతుంది. అందువల్ల వచ్చే  వర్షాకాలం లోపే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈలోగా పాత వంతెనకు కూడా మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి పేర్కొన్నారు.