06-03-2025 12:39:17 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సం దర్భంగా కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది. ప్రధానంగా రెండోదశ కులగణన కు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అలాగే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన రెండు బిల్లులపై చర్చించనున్నారు. బీసీలకు ఉద్యోగ, విద్యలో రిజర్వేష న్‌కు సంబంధించి ఒకటి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌కు సంబంధించి మరొకటి, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అంశాలపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది.
దీనివల్ల బడ్జెట్ సమావేశాలపై కూడా క్లారిటీ రానుంది. అసెంబ్లీలో ఈ మూడు బిల్లులను ఆమోదించిన తర్వాత ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలి? ప్రధాని ని ఎప్పుడు కలవాలి? అనే దానిపై ఈ భేటీలోనే స్పష్టత రానుంది.
ఇసుక సరఫరాలో సంస్కరణలపై..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. ఇప్పటికే టూరిజం పాలసీ తుది దశకు వచ్చింది. ఈ పాలసీపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. వీలయితే పాలసీకి క్యాబినెట్ ఆమోదం కూడా లభించవచ్చు. ఇప్పటికే టూరిజం పాలసీపై సీఎం ప్రత్యేకంగా పలుమార్లు సమీక్షించారు. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఆ పాలసీ డ్రాఫ్ట్ ఆమోదం పొందే అవకాశముంది.
అలా ఇసుక సరఫరాలో పారదర్శకతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో నిఘా వ్యవస్థను పటి ష్ఠం చేసి.. అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ఇసుక సరఫారాలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుకను సరఫరా చేసే ఆలోచనలో రేవంత్‌రెడ్డి సర్కారు ఉంది.