రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఓఆర్‌ఆర్ టెండర్లపై నియమించే సిట్ అంశాలపై చర్చ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాం తి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థికసా యం, కొత్త రేషన్‌కార్డుల జారీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సం స్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, కొత్త ఆర్వోఆర్ చట్టం తదితర అంశాలపై చర్చించ నున్నారు.
దీంతోపాటు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఓఆర్‌ఆర్ టెండర్లపై సిట్ వేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సిట్ అంశంపైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం.