వరద నష్టం, హైడ్రా, కులగణనపై చర్చ
హైదరాబాద్,సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆరోజు సాయం త్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో వరద నష్టం, కేంద్ర ప్రభు త్వం సాయం, హైడ్రాకు చట్టబద్ధత, కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించ నున్నట్లు తెలుస్తుంది.
చెరువులు, కుంటలు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటుచేసిన హైడ్రాపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో హైడ్రాకు చట్టబద్దత, హైకోర్టులో కౌంటర్ దాఖలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.