calender_icon.png 24 December, 2024 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న క్యాబినెట్ సమావేశం

24-12-2024 01:55:02 AM

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : ఈనెల 30న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. క్యాబినెట్ సమావేశంపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీ విధివిధానాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది.