calender_icon.png 20 October, 2024 | 8:55 AM

26న క్యాబినెట్ భేటీ

20-10-2024 01:42:13 AM

21న సియోల్‌కు సీఎం రేవంత్

  హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఈ నెల 26న సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ముందుగా నిర్ణయించిన 23వ తేదీకి బదులుగా 26న ఈ సమావేశం జరుగుతోంది. ఈ  సమావేశంలో హైడ్రా, మూసీ నది ప్రక్షాళన, గ్రూప్ అంశం, రైతు భరోసా విధి విధానాలు, రైతు రుణమాఫీ అమలు తీరు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామన్న హామీపై విధివిధానాలను రూపొందించే అంశంపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై మార్గదర్శకాల కోసం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిబంధనలపై చర్చిస్తారని సమాచారం. హైడ్రా అంశంలో కాస్త వ్యతిరేకత వచ్చినా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వంలో సానుకూలంగా ముందుకు సాగేందుకు చర్చ జరుగనున్నట్లు సమాచారం.

హైడ్రా, మూసీ ప్రక్షాళన, గ్రూప్ ప్రతిపక్షాల ఆందోళనపై మంత్రి మండలి చర్చించనుందని తెలుస్తోంది. కాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు పర్యటన ఉన్న నేపథ్యంలో మంత్రిమండలి సమావేశాన్ని 23 నుంచి 26కు వాయిదా వేశారు.