calender_icon.png 12 January, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ

12-01-2025 12:50:14 AM

  1. రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
  2. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శనివారం ఆయన మీడియా తో చిట్‌చాట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల జాతకాలు కేసీ వేణుగోపాల్ వద్ద ఉన్నాయన్నారు. రాబో యే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని నేతల పనితీరు ఉండాలని కేసీ హెచ్చరించినట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో త్వరలో ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయన్నారు. గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండకుండా మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామన్నారు. పలు కార్పొరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.