calender_icon.png 26 March, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబినెట్ విస్తరణ

25-03-2025 01:17:20 AM

  1. డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ 
  2. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చ 
  3. ఖర్గే, రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ భేటీ

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : తెలంగాణలో మంత్రివర్గ విస్తర ణకు పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏడాదిన్నర నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి అయింది. ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉగాది పండుగలోగానే క్యాబి నెట్ విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

కాంగ్రెస్ అధి ష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీ సీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతి పక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో దాదాపు రెండుగంటల పాటు సమావేశమై మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పార్టీ బలోపేతంపై వారు చర్చించారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీపడుతున్న అంశాన్ని చర్చిం చారు. జిల్లాలు, సామాజిక అంశాలతో పా టు ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు మంత్రిపదవిపై ఇచ్చిన హామీలపై చర్చించారని తెలిసింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, అదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు ఖరారు చేసినట్లుగా తెలిసింది.

అయితే  ముస్లిం మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్‌అలీఖాన్  పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లుగా తెలిసింది. ఇక మహిళా కోటాలో విజయశాంతి పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్నారు.

వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ లేదా ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మూసీ రివ ర్‌ప్రంట్ చైర్మన్ పదవిని మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలి సింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి డిప్యూటీ స్పీకర్, మున్నూరు కాపు సామాజికవర్గానికి  ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాల ని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 

అన్ని అంశాలు త్వరలోనే కొలిక్కి: మహేష్‌కుమార్

కాంగ్రెస్ పెద్దలతో జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న కార్పోరేషన్లకు, వివిధ బోర్డులకు నియామకాలపై కూడా చర్చ జరిగిందని, వాటి భర్తీకి కూడా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలు రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆరోగ్యం, విద్య వ్యవహారాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు పలు అంశాలపై సమగ్ర సమాచారం రాహుల్ తీసుకు న్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.  

ఈ వార్తలు కూడా చదవండి..

నల్లకుంట ఆక్రమణ తొలగింపునకు అడుగులు

ప్రపంచదేశాలకు రోల్‌మాడల్‌గా హైదరాబాద్

లక్నోకు షాకిచ్చిన ఢిల్లీ

నడిచే కలవా.. ఎగిరే అలవా..

రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక