05-02-2025 01:24:58 AM
రెండు నివేదికలపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాం తి): ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎ స్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసు చేసిన క్రిమిలేయర్ విధానాన్ని మంత్రివర్గం తిరస్కరించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది.
ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిష న్ నివేదించగా అందుకు ప్రభుత్వం సమ్మతించింది. కులగణన, ఎస్సీ వర్గకరణలకు సంబంధించిన నివేదికలపై ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే అనుకున్న సమయంలో క్యాబినెట్ సమావేశం పూర్తి కాలేదు.
దీంతో ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి.. క్యాబినెట్ సమావేశం పూర్తికాలేదని, అందుకు సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వా యిదా వేయాలని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మండలిలో చైర్మన్‌ను మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉభయ సభలూ వాయిదా పడ్డాయి.