రాజేంద్రనగర్, జనవరి 25: ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించడం లేదని క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శనివారం ఎయిర్‌పోర్టు రహదారిలో పలువురు క్యాబ్ డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించారు. మనం ఎయిర్‌పోర్టులోకి ఎందుకు అనుమతించడం లేదని ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. ఎన్ని రోజులు అనుమతించి ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తు న్నారన్నారు.
సిఐఎస్ఎఫ్, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులో తమకు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.